స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం 2 '. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -106 లో.....కార్తీక్ నా జీవితానికి సంబంధించిన విషయం చెప్పాలని అనగానే అందరు ఆశ్చర్యంగా చూస్తారు. ఈ విషయం చెప్పేటప్పుడు అందరు ఉండాలి దీప కూడా ఉండాలి అనగానే శౌర్య వెళ్లి దీపని తీసుకొని వస్తుంది. ఏంటి బాబు పిలిచారట అని దీప అడుగుతుంది. చెప్తానని కార్తీక్ అంటాడు. ఏం చెప్తాడోనని అందరు టెన్షన్ పడతారు. ఆల్రెడీ పెళ్లి అయిన నా జీవితం గురించి చెప్తానని అనగానే.. అందరు షాక్ అవుతారు. డౌట్ లేదు దీప పేరు చెప్తాడని జ్యోత్స్న వెనకాల నుండి కత్తి రెడీగా పెట్టుకుంటుంది. అది చూసి పారిజాతం టెన్షన్ పడుతుంది.
ఇప్పుడు ఆల్రెడీ పెళ్లి అయిన నా గురించి ఎందుకు అన్నానంటే.. ముందే భార్యాభర్తలుగా పైనే డిసైడ్ అవుతుంది గనుక. కేవలం మనం నిర్ణయం మాత్రమే తీసుకోవాలి. పెళ్లి అయిన జంటకే మళ్ళీ పెళ్లి చేస్తారు. ఎవరు ఆ పెళ్లి అయిన జంట అనుకుంటున్నారా అని కార్తీక్ అనగానే.. దీప, జ్యోత్స్న ఎవరి పేరు చెప్తాడని టెన్షన్ పడుతారు. ఎవరో కాదు నేను జ్యోత్స్న అనగానే.. అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏం ట్విస్ట్ ఇచ్చావ్ అంటూ పారిజాతం స్పృహ తప్పిపడిపోతుంది. స్పృహ లోకి వచ్చాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు నువ్వు హ్యాపీనా అమ్మ అని కార్తీక్ కాంచన ని అడుగుతాడు. చాలా హ్యాపీగా ఉందని కాంచన చెప్తుంది. ఇక షాపింగ్ కి వెళ్లడమే అని అనగానే.. అవసరం లేదు నా ఫ్రెండ్ కి మాల్ ఉంది.. ఫోన్ చేస్తే అన్ని తానే తీసుకొని వస్తాడని కార్తీక్ అంటాడు.
ఆ తర్వాత జ్యోత్స్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాంచన శ్రీధర్ ల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. మరొకవైపు శోభ ఇంక పాపని తీసుకొని రావడం లేదని ఇండైరెక్ట్ గా అనసూయతో కోపంగా మాట్లాడుతుంది. అప్పుడే నరసింహ వస్తాడు. ఒరేయ్ రేపు వెళ్లి పిల్లని తీసుకొని రావాలని అనసూయ నరసింహాతో చెప్తుంది.ఆ తర్వాత థాంక్స్ బాబు మంచి నిర్ణయం తీసుకున్నారని దీప అంటుంది. తండ్రి గురించి శౌర్యకి నిజం తెలియద్దని మీరు అనుకుంటున్నారు.. మా అమ్మకి నాన్న గురించి తెలియద్దని నేను అనుకుంటున్నానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత రోజు ఇక కార్తీక్ బాబు దగ్గరకి వెళ్లొద్దని శౌర్యకి దీప చెప్తుంది. మరొకవైపు మా నాన్న మా అమ్మని మోసం చెయ్యకుంటే నా నిర్ణయం వేరేలా ఉండేది.. రేపు జ్యోత్స్న తో ఎంగేజ్ మెంట్ ఎవరు ఆపలేరు.. అంత అవసరం కూడా లేదని కార్తీక్ బాధపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగా